Sunday, June 17, 2012

బుజ్జమ్మ రాత్రిళ్ళు మేల్కుంటుంది. సరిగ్గా 11.30 అనేసరికి లేచి, తెల్లారి 5.30 కి పడుకుంటుంది. మద్యలో ఎదో మా కోసం కొద్దిసెపు విశ్రాంతి తీసుకుంటుంది. ఈ నాల్రోజులనుండి అదీ లేదు. తెల్లారి 4కి లేస్తే ఇక అంతే సంగతులు. బజ్జో బజ్జో అంటే, దానికి మాత్రం నిద్ర రాకపొతే ఎం చేస్తుంది, మేల్కొని ఆడుతుంది కొద్దిసెపు, చాల సెపు రాగాలు తీస్తుంది :). గత 2రోజులనుండి మ నాన్నగారు కూడ ఆడిస్తున్నారు.

Friday, June 8, 2012

పుట్టినపుడు బుజ్జమ్మకి పెద్దగ జుట్టు లేదు, ఇప్పుడిప్పుడు బాగ పెరుగుతోంది, ఇంకేం ఆయుధం దొరికింది పాపకి. కుడి చేయి వెనక్కు పెట్టి. జుట్టుని పిడికిలిలో బిగిస్తుంది. లాగుతుంది జుట్టుని. అది రాదు, అంతే ఇక సంగీతం మొదలవుతుంది. నే వెళ్ళి విడిపించుదాం అన్నా, పిడికిలి వదలదే. అది విడిపించినందుకు మళ్ళి ఓ 5నిమిషాలు ఏడ్చి పడుకుంటుంది.

Thursday, June 7, 2012

మొదటి సారి సాంబ్రాణి వేసాం బుజ్జమ్మకి. పాపం బయపడి ఓ అని ఏడుపు అది అయ్యెదాక. దాన్ని సముదాయించడానికి మా అమ్మ పాటలు. ఒక్క 5నిమిషాలకు ఏడుపు ఆపింది.హమ్మయ్య అని మేము, బుజ్జి అనుకున్నాం :)
ఇక అసలు ఘట్టం మొదలు. బొట్టు పెట్టించుకుంటుంది కాని, కాటుక అంటే మాత్రం యుద్ధం చేయాల్సిందే :). అన్ని అయ్యి ఫ్రెష్ అయ్యేసరికి పాపం బుజ్జి అలసిపోయి నిద్ర పోతుంది. మాకు మాత్రం ప్రతి క్షణం ఆనందమే.

Friday, May 18, 2012

బుజ్జమ్మ రాక...

మా పాప పుట్టినరోజు నుండి నాకు కొత్త జీవితం మొదలైంది. పొద్దున లేచినప్పటినుంది పాపే లోకం. బుజ్జిదానికి ఏమి తెలియకపోయినా, నేను ఏమి చెప్పినా కళ్ళు పెద్దవి చేసి వింటుంది. మొన్న పుట్టినట్లు ఉంది, అప్పుడే బుజ్జమ్మ కి మూడో నెల వస్తోంది. పొద్దుటనుండి హాయిగా నిద్ర పోవడం. అప్పుడప్పుడు నే ఉన్న అన్నట్లు ఏడవడం. నిద్రలో బొసినవ్వులు, ఎత్తుకోమని కాళ్ళు నేలకేసి కొట్టడం ఇలా ప్రతీది మాకు ఆనందాన్ని ఇస్తోంది బుజ్జమ్మ. కాని పాపం ఈ ఎండలకి మాత్రం విలవిల లాడిపోతున్నాది. ( పెద్దవారే తట్టుకోలేకపోతున్నారు). రాత్రి అయితే చిరాకు. చెప్పలేదు. అమ్మ మాటలు, అమ్మమ్మ పాటలతో కొంచెం నెమ్మదిస్తుంది. పాట ఆగితే చాలు ఆట మొదలెడ్తుంది :).

( మా బుజ్జమ్మ తో మేము పొందే ఆనందాన్ని బ్లాగు రూపంలో రాస్తే బాగుంటుంది అని మొదలు పెట్టాను. మా బుజ్జిది ఎంతవరకు నాకిచాన్సు ఇస్తుందో చుడాలి :)